Wednesday, December 8, 2010

వెల్‌కం టు జగన్ పార్టీ

పోటీ మా ఇద్దరి మధ్యేనంటున్న టీడీపీ నేతలు
యువత, ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉప్పొంగుతున్న ఉత్సాహం
ఆచితూచి మాట్లాడుతున్న కాంగ్రెస్ ముఖ్యులు

తిరుపతి-న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘45 రోజుల్లో మన పార్టీ వస్తుంది’ అని యువనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం చేసిన ప్రకటన జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. మంత్రి పదవుల పంపకంపై చెలరేగిన మంటల ఆనవాళ్లు ఇంకా పూర్తిగా చల్లారకముందే ఈ ప్రకటన వెలువడడం కాంగ్రెస్ పార్టీలో కొత్త సమీకరణలకు తెర లేపనుంది. రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీకి తమ పార్టీకి మధ్యే ప్రధాన పోటీ జరుగుతుందని తెలుగుదేశం నేతలు ప్రకటించారు. మెజారిటీ జనం పార్టీని స్వాగతించగా, అన్ని పార్టీల్లో యువత, ద్వితీయశ్రేణి నాయకులు అనేక ఆలోచనలతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

జిల్లాలో తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల్లో ప్రస్తుతం రాజకీయ స్తబ్దత నెల కొంది. అనేక నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ గత ఐదా రేళ్ల నుంచే పార్టీ ఒడిదుడుకుల ప్రయాణం చేస్తోంది. తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు నియోజకవర్గాల్లో అం తర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయి.

కొందరు నాయకులు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో కలిసి ఉండలేక, అలాగని బయటకు పోలేక ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. అధినేత చంద్రబాబుకే తమ గోడు వెళ్లబోసుకున్నా ఏ మాత్రం ఉపయోగం కనిపించడం లేదని నిరుత్సాహపడ్డారు. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి తిరుపతిలో మాత్రం ఒక రకంగా, చంద్రగిరి, చిత్తూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో అడపా, దడపా పార్టీ తరపున కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది అభ్యర్థులు కనిపించకుండా పోయారు. పీలేరు, తంబళ్లపల్లె, నగరి, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల అభ్యర్థులు పార్టీతో తెగదెంపు లు చేసుకున్నారు. చిరంజీవిని నమ్మి ఇతర పార్టీల్లోంచి వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు, పీఆర్పీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని ఆశపడిన క్యాడర్ పార్టీ వైపు చూడటానికి భయపడుతున్నారు.

డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో సైతం అనేక వీధి పోరాటాలు ప్రారంభమయ్యాయి. రెండు, మూడు మినహా ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి వర్గాలు తయారయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ కొత్త పార్టీ పెడతారనే సంకేతాలు వెలువడినప్పటి నుంచి జిల్లా రాజకీయ సమీకరణలపై అనేక రకాల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ పార్టీ రాకతో జిల్లా రాజకీయ ముఖచిత్రం రూపు రేఖలు మారుతాయని అన్ని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. పార్టీ ప్రకటన కు ముందే అనేక మంది తాము జగన్ వెంటే ఉంటామని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్ కొత్త పార్టీ ఏర్పాటు గురించి స్వయంగా ప్రకటించడం జిల్లా రాజకీయాలకు కొత్త ఉత్సాహం నింపింది. జగన్ పార్టీ కాంగ్రెస్ ను చావుదెబ్బకొట్టి తమకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని టీడీపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందని వారు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. పీఆర్పీ అధినేత చిరంజీవి కాంగ్రెస్‌తో జత కట్టకపోతే తమ పార్టీ మ రింత బలహీన పడుతుందని ప్రజారాజ్యం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జగన్ ప్రభంజనం ముందు తమ పార్టీ ఒంటరి పోరాటం చేయడం కష్టమేనన్న అభిప్రాయాలు ఆ పార్టీ వ ర్గాల్లో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరు ఈ వ్యవహారంపై నోరు మెదపడానికి తటపటాయిస్తున్నారు.

పరిస్థితి ఎలా వచ్చి ఎలా పోతుందోనని ఇలాంటి నేతలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన అనేక మంది నేతలు జగన్‌తో చేయి కలపడానికి తాము సిద్ధమేనని సంకేతాలు పంపుతున్నారు. సీపీఐ, సీపీఎం, బీజేపీలు సైతం జగన్ పార్టీతో కాంగ్రెస్‌కు గడ్డురోజులేననీ, రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ కలగలిసి మరో నెల రోజుల తర్వాత జిల్లాలో మరింత రాజకీయ సందడి నెలకొని స్వరూప, స్వభావాలు మారిపోయే వాతావరణం కనిపిస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అభిమానులు కొత్త పార్టీని స్వాగతిస్తూ ఆనందోత్సాహాలు జరుపుకున్నారు.

కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ
జగన్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తప్పదు. వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు జగన్‌కు లాభిస్తాయి. పదవుల కోసం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తరచూ ముఖ్యమంత్రులను మార్చి పార్టీ పట్టును నిలుపుకోవడానికి రాజకీయాలు చేస్తున్న అధిష్టానం మూల్యం చెల్లించుకోక తప్పదు.
-జీ.భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే
ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. ఎన్ని పార్టీలైనా రావచ్చు. జగన్ పార్టీపెడితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే. అయితే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేయబోమని జగన్ ప్రకటించిన నేపథ్యంలో 2014 వరకు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారకపోవచ్చు. జగన్ కొత్త పార్టీ విధి విధానాలు ఏమిటో తెలిసిన తర్వాత ఆ పార్టీ గురించి వ్యాఖ్యానించే వీలుంటుంది.
-పీ.హరినాథరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి

పాత పార్టీలో గుత్తాధిపత్యానికి చెక్
జగన్ పార్టీని సీపీఎం స్వాగతిస్తోంది. ఎన్ని కొత్త పార్టీలు వస్తే అంతమంచిది. కొత్త పార్టీల వల్ల పాత పార్టీలో గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట పడుతుంది. జగన్ పార్టీ విధి విధానాలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతాయో చూడాలి.
-కే.కుమార్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి

జగన్‌కు మాకే పోటీ
జగన్ పార్టీకి మాకు మధ్యే పోటీ ఉంటుంది. కాంగ్రెస్‌కు భారీ నష్టం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టడం తప్పుకాదు. ఈ పరిణామం ముందుగా ఊహించినదే.
-గాలి ముద్దుకృష్ణమ నాయుడు, నగరి ఎమ్మెల్యే

కాంగ్రెస్‌కు చెడ్డ రోజులు
జగన్ ప్రభంజనంతో కాంగ్రెస్‌కు చెడ్డరోజులు రాబోతున్నాయి. జనమంతా ఆయన వెంటే ఉన్నారు. ఓట్లు లేని వారిని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న 10 జన్‌పథ్‌కు ఎదురుగాలి తప్పదు.
-నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే, సత్యవేడు

పోటీ మా ఇద్దరి మధ్యే
జగన్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. ఈ పోటీలో కాంగ్రెస్‌కు చావు దెబ్బ తప్పదు. ఈ పరిణామాలు మాకెంతగానో లాభిస్తాయనే గట్టి నమ్మకంతో మేమున్నాం.
-హేమలత, ఎమ్మెల్యే సత్యవేడు

4 comments:

  1. Hi please tell me your opinion on NEW Party Name. New party should be beyond the borders of telugu people. New party should establish step in all states of Dhakshina Bharth. He should also contact 1) dhakshin bharathiya leaders like Jayalalitha, Akbar Uddin Oysi, (Devagouda), congress leaders of Kerala, Tamilnadu, Karnataka etc 2) Congress party leaders of Telangana, Coastal Andhra & Rayalaseema

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. New Party Names
    1) Bharth Congress Party or Bharathiya Congress Party
    2) Dhakshina Bharathiya Congress Party(limitations of target in South India only)
    3) Bharathiya Janatha Congress Party
    4) Y S R Congress (Limitations of target in Telugu people's Land only)

    ReplyDelete
  4. All pranthiya parties(Jayalalitha party, Devagowda, Kerala, Y S Jagans New Part) should come to establish new party like Dhashina Bharathiya Party or Bharathiya Congress Party or Bharathiya Janatha Congress Party for Loksabha seats only. For Assembly seats they should participate with their party only. First our Y S Jagan should establish New Party, then Y S Jagan Should ask all south Indian leaders like Jayalaitha, Devagowda, Kerala Congress persons etc to esablish New Party only for Loksabha elections.

    ReplyDelete

YSR CONGRESS RULES